శ్రీ ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఆదాయం ఎంతంటే..

శ్రీ ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఆదాయం ఎంతంటే..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం హుండీలను దేవాదాయ శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ కే భాస్కర్ పర్యవేక్షణలో దేవాలయం సిబ్బంది లెక్కించగా 7 నెలల 20 రోజులకు గాను భక్తులు మొక్కుబడులు, కానుకలుగా సమర్పించిన రూ. 26,73,578 లు దేవాలయానికి ఆదాయం సమకూరినట్లుగా కార్యనిర్వాహణ అధికారి ఎస్ మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ క్యాషియర్ జి సుశాంత్, శ్రీవారి సేవా సమితి ప్రతినిధులు, అర్చక స్వాములు, పోలీస్ లు, దేవాలయ సిబ్బంది, మహిళా భక్తులు పాల్గొన్నారు.
