SRH vs LSG | సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే

లక్నో : సొంత‌మైదానంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్(65), ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్(61)లు విధ్వంసం సృష్టించారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ అర్ద శ‌త‌కాలతో లక్నో భారీ స్కోర్‌కు పునాది వేశారు. తొలి వికెట్‌కు 115 ర‌న్స్ జోడించడంతో సులువుగా రెండొంద‌లు కొడుతుంద‌నిపించింది.

కానీ, మిడిల్ ఓవ‌ర్ల‌లో పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. అయితే.. డేంజ‌ర‌స్ నికోల‌స్ పూర‌న్(45) డెత్ ఓవ‌ర్ల‌ర్లో మెరుపు బ్యాటింగ్‌తో ల‌క్నోను 200ల‌కు చేరువ చేశాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో చివ‌రి బంతిని ఆకాశ్ దీప్(6 నాటౌట్) స్టాండ్స్‌లోపి పంప‌డంతో ల‌క్నో 7 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది.

సన్‌రైజర్స్ టార్గెట్ @ 206

లఖ్‌నవూ స్కోరు 20 ఓవర్లకు 205/7

రాణించిన మిచెల్ మార్ష్ (65)మార్‌క్రమ్ (61)నికోలస్ పూరన్ (45)

ఎషాన్ మలింగకు రెండు వికెట్లు

Leave a Reply