హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్‌ను ఘనంగా ఆరంభిం చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సొంతగడ్డపై మరో పోరుకు సిద్ధమైంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగనున్న తమ రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు తమదైన స్టయిల్లో పరుగుల ప్రళయం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 286 పరుగులు చేసింది. ఓ దశలో 300 పరుగుల మార్క్ అందుకు నేటట్లు కనిపించినా ఆఖరి ఓవర్లో వరుసగా వికె ట్లు పడిపోవడం తో 286 పరుగులతో సరిపెట్టుకుంది. కానీ, ఇప్పుడు ఆ టార్గెట్-300 స్కోరును సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సన్‌రైజర్స్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీయే ఫేవరెట్‌గా బరిలోకి దిగు తోంది. ఇరుజట్ల బలబలాలను చూసు కున్న ప్రస్తుతం సూపర్ జెయింట్స్ కంటే సన్‌రైజర్స్ జట్టే చాలా పటిష్టంగా కనిపి స్తోంది.
ఐపీఎల్-2024 సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లో 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేద నకు దిగిన సన్‌రైజర్స్ 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఊదేసి చరిత్ర సృష్టించింది. ఆరు ఓవర్ల పవర్‌ప్లేలో ఏకంగా 107 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్), అభి షేక్ శర్మ (28 బంతుల్లో 75) పెను విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కూడా సన్‌రైజర్స్ బ్యాటర్లు అదే జోరు కొనసాగిం చేందుకు రెడీ అయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్‌లకు ఈసారి మరో విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ తోడ య్యాడు. తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ సూపర్ అజేయ శతకంతో రాజస్తాన్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ ముగ్గురితో పాటు ఇంకో ప్రమాదకరమైన బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా ఎస్ఆర్హెచ్లో ఉండటంతో ఈ జట్టు ప్రపంచలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారింది. 250 పైగా పరుగులు చేయడం ఇంత ఈజియా అన్నట్లు సన్‌రైజర్స్ ఆడుతుండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇక అసలే వీక్‌గా కనపడతున్న లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపెట్టేందుకు ఆరెంజ్ ఆర్మీ రెడీ అయింది. అబ్ కే బార్ 300 పార్ అంటూ సన్‌రైజర్స్ అభిమానులు కూడా హైదరాబాద్ జట్టుకు చీర్ చేస్తున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, హర్షల్ పటేల్‌లతో బౌలింగ్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందరూ కలిసి కట్టుగా రాణిస్తే మరో భారీ విజయం ఖాయమే.
లక్నో బౌలర్లకు పరీక్ష..
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటిం గ్లో పర్వాలేదనిపిస్తునా.. బౌలింగ్ లో మాత్రం చాలా వీక్‌గా ఉంది. ఢిల్లి క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్ ఎస్జీ 20 ఓవర్లలో 209/8 పరుగుల భారీ స్కోరు చేసిం ది. కానీ, ఈ కొండంత లక్ష్యా న్ని కాపాడుకోవడంలో లక్నో బౌలర్లు విఫలమ య్యారు. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ రిషభ్ పంత్ (0) నిరాశపరిచినా.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72), నికోలస్ పూరన్ (30 బంతు ల్లో 75) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌలింగ్‌లో రవి బిష్టోయ్, దిగ్వేశ్ రాఠీ, శార్దుల్ ఠాకూర్, సిద్దార్థ్ తలా రెండు వికెట్లు తీసినా.. పరుగులను మాత్రం నియంత్రించలేకపోయారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ వారికి కఠిన సవాల్‌గా మారింది. దాన్ని వాళ్లు ఎలా అధిగమిస్తారో చుడాలి.
జట్ల వివరాలు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా.
లక్నో సూపర్ జెయింట్స్: మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), అయూష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, మణిమరన్ సిద్దార్థ్.