ఉప్పల్ వేదికగా ఈరోజు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు తమ తడాఖా చూపించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఢిల్లీకి హైదరాబాద్ పేసర్లు షాక్ ఇచ్చారు. వరుస వికెట్లు తీసి తీవ్ర ఇబ్బందుల్లో పడేశారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు నమోదు చేసింది.
అయితే హైదరాబాద్ ధాటికి కుప్పకూలిపోయే లా కనిపించిన ఢిల్లీని ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ (41) ఆదుకున్నారు.
హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఈషాన్ మలింగ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక 134 పరుగుల స్వల్ప టార్గెట్ తో హైదరాబద్ జట్టు ఛేజింగ్ కు దిగనుంది.