SRH vs DC | నిప్పులు చెరుగుతున్న హైద‌రాబ‌ద్.. క‌ష్టాల్లో ఢిల్లీ !

ఉప్ప‌ల్ వేదిక‌గా ఈరోజు ఢిల్లీతో జ‌రుగుతున్న మ్యాచ్ లో హైద‌రాబాద్ పేస‌ర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్వ‌ల్ప ప‌రుగుల‌కే కీల‌క వికెట్లు కోల్పోయింది.

హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వరుసగా 1, 3, 5వ ఓవర్ల మొదటి బంతికే ఓపెనర్లు కరుణ్ నాయర్ (0), ఫాఫ్ డు ప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8)లను అవుట్ చేశాడు. దాంతో ఢిల్లీ జ‌ట్టు 15 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది.

ఆ వెంట‌నే 5.5వ ఓవ‌ర్లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్ లో ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (6) ప‌రుగుల‌కు క్యాచ్ ఔట‌య్యాడు. ఆ తర్వాత, మ‌రో కీల‌క ప్లేయ‌ర్.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్, 7.1వ ఓవర్‌లో జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ జ‌ట్టు 7.1 ఓవ‌ర్ల‌లో 29 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది.

ఇక ప‌ది ఓవ‌ర్ల‌కు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 5 వికెట్ల న‌ష్టానికి 47 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ విప్ రాజ్ నిగ్గమ్ ఉన్నారు.

Leave a Reply