SRH vs CSK |ధోనీ సేన ఇంటికి – సన్ రైజర్స్ ముందుకి

చెన్నై: ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లదీ కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ దశలో ధోనీ సేన హైదరాబాద్‌ కాస్త తడబడినా కీలక విజయం అందుకుంది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44), కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్‌) సమయోచిత బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో గట్టెక్కించారు. అటు సొంత మైదానంలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి చేతులెత్తేసింది. బౌలర్లు కాస్త ఆశలు రేపినా.. చివర్లో తడబాటుతో చెపాక్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. దీంతో ధోనీ సేన మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కష్టమే.

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. బ్రెవిస్‌ (25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 42), ఆయుష్‌ మాత్రే (19 బంతుల్లో 6 ఫోర్లతో 30), దీపక్‌ హుడా (21 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 22) రాణించారు. హర్షల్‌కు 4, కమిన్స్‌, ఉనాద్కట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఛేదనలో సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 రన్స్‌ చేసి నెగ్గింది. హెడ్‌ (19), అనికేత్‌ (19), నితీశ్‌ (19 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. నూర్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్షల్‌ నిలిచాడు.

Leave a Reply