పాకిస్థాన్‌కు మద్దతుగా గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హర్యానాలోని హిసార్‌లోని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు, పోలీసులు ఆమెను కొన్ని రోజులు తమ కస్టడీలో తీసుకోగా, ఆ గడువు ముగియడంతో ఈరోజు (సోమవారం) జ్యోతి మల్హోత్రాను మరోసారి కోర్టులో హాజరుపరిచారు.
వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి ఆమెను 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఈ గూఢచర్య ఆరోపణల కేసులో ఇప్పటివరకు 10 మందికిపైగా వ్యక్తులు అరెస్ట్ అయినట్లు సమాచారం. కేసు విషయమై అధికారులు మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

