Sports | యువత క్రీడల వైపు అడుగులు వేయాలి

Sports | యువత క్రీడల వైపు అడుగులు వేయాలి
- సురిగి నరసింహా గౌడ్
Sports | మునుగోడు, ఆంధ్రప్రభ : యువత క్రీడ(Sports)ల వైపు అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చెనగోని కాటంరాజు గౌడ్, కీర్తిశేషులు వడ్డేపల్లి సుధాకర్ జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురిగి నరసింహ గౌడ్ రూ.5000లు వినాయక యూత్ సభ్యులకు విరాళం అందజేశారు.
అనంతరం నరసింహ గౌడ్ మాట్లాడుతూ… యువత అన్ని రంగాల్లో ముందుండాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మ కంటి అశోక్, చెన్నగోని సైదులు, ఉమ్మెత్తల సాగర్, మారగోని చంద్రయ్య గౌడ్, ఉమ్మెత్తల కృష్ణ, బింగి రాజు, ఉమ్మెత్తల సాయికిరణ్, ఆరూరి కృష్ణ, ఆకుల శంకర్, బొంగు లింగస్వామి, మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
