Sports | యువ‌త క్రీడ‌ల్లో రాణించాలి…

Sports | యువ‌త క్రీడ‌ల్లో రాణించాలి…

Warangal | వేలేరు, ఆంధ్రప్రభ : యువత క్రీడల్లో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని బీఆర్ఎస్ మండల యూత్ ఇంచార్జి ఇట్టబోయిన సంపత్(This wealth) ఆకాంక్షించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ రోజు స్థానిక క్రికెట్ యూత్ అసోసియేషన్‌కు చెందిన 15మంది క్రీడాకారులకు బీఆర్ఎస్ మండల యూత్ ఇంచార్జి ఇట్టబోయిన సంపత్ టీషర్ట్ లను అందజేశారు.

ఈ సందర్బంగా సంపత్ మాట్లాడుతూ..యువత క్రీడ లలో రాణించేందుకు నావంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాని ఈ సంద ర్భంగా ఆయన వివరించారు. క్రీడల(Sports) ద్వారా శారీరక దృఢత్వం, క్రమ శిక్షణ, టీమ్‌వర్క్(Teamwork) పెరుగుతాయని పేర్కొన్నారు. స్థానిక యువత, క్రీడా కారులు బీఆర్ఎస్ నాయకుడు సంపత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేలేరు బీఆర్ఎస్ గ్రామ కన్వీనర్ సూత్రపు సంపత్, మండల మైనార్టీ సెల్ ఎండి ఫారుక్, సీనియర్ నాయకులు కొయ్యాడ వేంకటస్వామి ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్ల ప్రభాకర్(Bolla Prabhakar), గజ్జెల్లి ప్రసాద్, కొయ్యడ చిరంజివి, జెట్టి రాజు, గూడూరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply