అటవీశాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
నంద్యాల బ్యూరో అక్టోబర్ 11 ఆంధ్రప్రభ : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని కన్జర్వేటివర్ అఫ్ ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రొజెక్ట్ టైగర్ సర్కిల్ అధికారి బి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆర్జీఎం కళాశాల గ్రౌండ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు రెండు రోజులు పండగ వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడారు. నిత్యం వన్యమృగాలతో ఉంటూ అడవుల్లో విధులు నిర్వహించే అటవీ శాఖ ఉద్యోగులకు క్రీడలు చాల అవసరమన్నారు. సిబ్బంది ఎక్కువ శాతం అటవీ ప్రాంతంలోనే ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
అటవీ శాఖ సిబ్బంది ఒత్తిడికి లోను కాకుండా కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తూ ఆటవిడుపుగా తమ ఆరోగ్యాలను కాపాడుకునే అవకాశాన్ని కల్పించాలన్న సదుద్దేశంతో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.71వ ఎన్ఎస్టిఆర్ సర్కిల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా అటవీశాఖ ఉద్యోగులకు పోటీతత్వాన్ని స్ఫూర్తిని మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలను ఏర్పాటు చేశామన్నారు.ఈ క్రీడా పోటీల్లో నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు,మార్కాపురం, నంద్యాల జిల్లా ఆత్మకూరు, డివిజన్ల అటవీశాఖ ఉద్యోగులు కబడ్డీ,క్రికెట్, టెన్నిస్,లాంగ్ జంప్,తాడు లాగు తదితర పోటీల్లో పాల్గొన్నారు.
ఈ క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం విజేతలకు విజయ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా, ప్రకాశం జిల్లా గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ అధికారిణి నిషాకుమారి,మహ్మద్ డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అధికారి అబ్దుల్ రవుఫ్, సబ్ డివిజన్ డిఎఫ్ఓ బాలరాజు, ఏ సి ఎఫ్ సబ్ డివిజన్ డిఎఫ్ ఓ,ఎస్.బి.శ్రీనివాస్ జెడ్. ఎఫ్ ఆర్ డి అధికారి నాసిర ఝా, జి బి ఎం ఎఫ్ ఆర్ ఓ ఉదయ్ దీప్, గాజులపల్లె జిడిటీ ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసులు, రుద్రవరం ఎఫ్ఆర్ఓ ముర్తుజావలి పాల్గొన్నారు.