SPORTS | అప్పుడే ఆట ఆపేద్దామనుకున్న..
- 2023 వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి బాధించింది
- క్రికెట్‌ను పూర్తిగా వదిలేయాలనుకున్న..
SPORTS | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐసీసీ వన్డేవ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమిని ఇప్పటికీ అభిమానులు మరచిపోలేదు. కళ్ల ముందే ట్రోఫీ, టీమిండియాకు (Team India) వన్ సైడ్ సపోర్ట్, ఇక ఆ టైటిల్ మనదే అని అందరూ అనుకున్నారు. కానీ కంగారులు ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ గెలిచేసి టైటిల్ ఎగరేసుకు పోయింది. ఇది భారత అభిమానులతో పాటు, ఆటగాళ్లకు కూడా కన్నీళ్లు మిగిల్చింది. ఇక భారత ఆటగాళ్ల బాధ వర్ణనాతీతం. వరుసగా 10 మ్యాచులు గెలిచి ఫైనల్లో ఓడిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఈ వరల్డ్ కప్ ఓటమిపై ఇటీవల భారత మాజీ కెప్టెన్ రోహిత్ భావోద్వేగానికి గురయ్యారు.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ (Onday World Cup Final) ఓటమి నిరాశకు గురి చేసిందని, అప్పుడే ఆడటం ఆపేద్దామని అనిపించిందని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్ చేశాడు. రెండేళ్ల పాటు వరల్డ్ కప్ కోసం శ్రమించామని, కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామన్నారు. టోర్నీ ఆసాంతం బాగా ఆడి, ఫైనల్లో ఊహించని ఓటమి నన్ను కుంగదీసింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత నేను పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. అందరూ చాలా నిరాశ చెందారు. ఈ భావన నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది. నెమ్మదిగా నేను తిరిగి నా మార్గాన్ని, శక్తిని తిరిగి పొందాను. మైదానంలో మళ్లీ దిగాను. ఆ తర్వాత ఆ సంక్లిష్ట సమయాన్ని దాటి మళ్లీ ఆడటం ప్రారంభించానని, 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచామని తెలిపాడు.
ఈ ఏడాది ప్రారంభంలో టీ20లు, టెస్ట్‌ల నుంచి హిట్‌మ్యాన్ రిటైర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో (Format) మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నాడు. ఇందులో భారత్‌కు వరల్డ్ కప్ గెలిపించి తన కెరీర్‌ను విజయంతో ముగించాలనుకుంటున్నాడు.

