Sports | వన్డే టోర్నీకి కర్నూలు కౌసల్య..

Sports | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా క్రీడా చరిత్రలో మరో స్వర్ణాధ్యాయం లిఖితమైంది. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ముంబై(Mumbai)లో జరగనున్న అండర్-19 ఉమెన్స్ వన్డే క్రికెట్ టోర్నీకి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్.బండ గ్రామానికి చెందిన కౌసల్య బాయి ఎంపిక కావడం జిల్లా వాసులకు గర్వకారణంగా మారింది. గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన కౌసల్య ప్రయాణం(Journey of Kausalya) నేటి యువతికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం కర్నూలులో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కౌసల్య, విద్యతో పాటు క్రీడలలోనూ సమానంగా రాణిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. చిన్నతనం నుంచే క్రికెట్‌ పై ఆసక్తి పెంచుకున్న ఆమె, అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో చక్కటి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Sports

కోచింగ్‌ వ్యవస్థకు గుర్తింపు..
ఈ విజయంతో పాటు కర్నూలు క్రికెట్ ఆసోసియేషన్ శిక్షకుడు శ్రీనివాసులు(Srinivaslu)ను ఈ టోర్నీకి ఫీల్డింగ్ కోచ్ గా ఎంపిక చేయడం మరో విశేషం. ఇది కర్నూలు జిల్లాలో క్రీడల అభివృద్ధికి సరైన శిక్షణ, మార్గనిర్దేశం లభిస్తున్నదనే విషయాన్ని స్పష్టంగా చాటుతోంది. కౌసల్య విజయానికి శ్రీనివాసులు వంటి నిబద్ధత కలిగిన శిక్షకుల పాత్ర ఎంతగానో ఉందని క్రీడా వర్గాలు(Sports categories) విశ్లేషిస్తున్నాయి.

మహిళా క్రీడలకు దిశానిర్దేశం..
కౌసల్య ఎంపికతో జిల్లాలో బాలికల క్రీడా ప్రోత్సాహానికి(To encourage girls’ sports) కొత్త ఉత్సాహం లభించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయికి మహిళా క్రీడాకారులు ఎదగడమనేది ఇప్పటికీ సవాలుతో కూడుకున్న విషయం. అలాంటి పరిస్థితుల్లో కౌసల్య సాధించిన విజయం.. అనేక కుటుంబాల్లో ఆలోచనా ధోరణిని మార్చే స్థాయిలో ప్రభావం చూపనుందని విశ్లేషకుల అభిప్రాయం.

జిల్లా వాసుల అభినందనలు..
కౌసల్య బాయికి జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులు, విద్యార్థులు, యువత శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన(Best show ever) కనబర్చి జాతీయ జట్టుకు కూడా ఎంపిక కావాలని ఆకాంక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీకి మహిళా క్రీడాకారిణి ఎంపిక కావడం అరుదైన ఘనత. ఇది జిల్లా యువతకు ప్రేరణగా నిలవడమే కాకుండా, క్రీడల ద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చనే విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది.

Leave a Reply