Prabhas | సందీప్, ప్రకాష్ రాజ్ గొడవ ఏంటి..?

Prabhas | సందీప్, ప్రకాష్ రాజ్ గొడవ ఏంటి..?
Prabhas | సందీప్ రెడ్డి వంగా – ప్రకాష్ రాజ్ మధ్య డిఫరెన్స్ ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అయిన గాసిప్స్
వాయిస్ వీడియోతో వచ్చిన క్లారిటీ
వివేక్ ఒబెరాయ్ పోస్టర్‌తో మొదలైన కొత్త అనుమానాలు
నిజం ఏంటి..? అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
Prabhas | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ స్పిరిట్. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ఇటీవల స్పిరిట్ సెట్స్ పైకి వచ్చింది. అయితే.. ఈ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని న్యూస్ వైరల్ అవుతోంది. ఇదేదో గాసిప్ కాదు.. ఇది నిజమే.. దీనికి ఇదే సాక్ష్యం అంటూ వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఈ వార్త వెనకున్న వాస్తవం ఏంటి..?

Prabhas | ఆ వార్తలను ఖండించిన ప్రకాష్ రాజ్..
స్పిరిట్ మూవీకి సంబంధించి సందీప్ రెడ్డి వంగ.. ఆమధ్య ఓ వాయిస్ వీడియో రిలీజ్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించింది. ఆ విధంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakashraj) నటిస్తున్నారనే విషయం అందరికీ తెలిసింది. అయితే.. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి వంగ మధ్య డిఫరెన్స్ వచ్చాయని.. ఆ కారణంగా ప్రకాష్ రాజ్ స్పిరిట్ నుంచి తప్పుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదే నిజమే అంటూ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు ప్రకాష్ రాజ్.. సోషల్ మీడియా ద్వారా ఆ వార్తలను ఖండించారు. అసలు తన పాత్రకు సంబంధించి షూటింగే ఇంకా స్టార్ట్ కాలేదు.. ఆపండి మీ వాట్సాప్ స్టోరీలు అంటూ స్పందించారు.

Prabhas | సందీప్ పోస్ట్ తో అనుమానాలు..
ప్రకాష్ రాజ్ అలా స్పందించడంతో స్పిరిట్ మూవీ నుంచి తప్పుకోలేదు.. అందులో నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్ స్టార్ (Bollywood Star) వివేక్ ఓబరాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పిరిట్ మూవీలో వివేక్ ఓబరాయ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. అంత వరకు బాగానే ఉంది. అయితే.. వివేక్ ఓబరాయ్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రకాష్ రాజ్‌ను ట్యాగ్ చేయలేదు. దీంతో ఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ నిజంగానే తప్పుకున్నారంటూ వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రకాష్ రాజ్ స్పిరిట్ మూవీలో ఉన్నట్టా..? లేనట్టా..? అనే కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. మరి.. ఈ కన్ఫ్యూజన్పై ప్రకాష్ రాజ్ కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ.. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

