స్పైడర్ మ్యాన్ కు గాయలు..

ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు టామ్ హాలాండ్ హీరోగా నటిస్తున్న “స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే” సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. హార్ట్‌ఫోర్‌షైర్‌లోని వాట్‌ఫోర్డ్‌లో లీవ్స్‌డెన్ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, టామ్ పై నుంచి జారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. అత్యవసరంగా ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.
గత ఆగస్టులో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్ట్ 2026 జూలై 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఈ ప్రమాదం కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.
