Special Team | బిందెలు స్వాధీనపరచుకున్న పోలీసు అధికారులు
Special Team | తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : 41 బిందెలను స్వాధీన పరుచుకున్న స్పెషల్ టీం అధికారులు(Special Team Officers). వివరాల్లోకి వెళితే కన్కల్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైలారం రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతూ ఓట్ల కోసం బిందెల రూపంలో ప్రజలకు పంచుతున్నాడు అన్న సమాచారం మేరకు స్పెషల్ టీ అధికారులు, తాడ్వాయి ఎస్ ఐ నరేష్ పట్టుకొని కేసు నమోదు చేశారు.
ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.. ప్రజలు ఎవరు ఎలాంటి అభ్యర్థులు ఇచ్చే ప్రలోభాలకు డబ్బు, మందు, బహుమతుల(prizes)కు లొంగకుండా ఓటు హక్కును స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు ఎవరైనా బహుమతుల రూపంలో పంచినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

