• ప్రజలపై వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలి..
  • 71 ఏళ్ల ప్రతిష్టాత్మక ఉత్సవాలపై ప్రశంసలు
  • సవాళ్లను అధిగమించిన ఉత్సవ వైభవం
  • 1.40 లక్షల విగ్రహాల ప్రతిష్ఠ

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ : గత 71 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, ఖైరతాబాద్(Khairatabad) బడా గణేష్ ఉత్సవాలు దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయ‌ని, ప్రజలందరిపై వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతి ఆలయాన్నిసందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిర్వాహకులు ఎంతో శ్రమించి ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని వారిని అభినందించారు. ప్రస్తుత కాలంలో ఒక పెద్ద ఉత్సవాన్ని నిర్వహించడం కూడా కష్టంగా మారిన తరుణం(Tarunam)లో, ప్రతి సంవత్సరం ఎన్నో అడ్డంకులను అధిగమించి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలను ఘనంగా జరపడం ఒక అద్భుతమని ఆయన కొనియాడారు.

హైదరాబాద్ నగరం(Hyderabad city)లో సుమారు 1.40 లక్షల విగ్రహాలను ప్రతిష్టించి, అద్భుతమైన వైభవంతో ఉత్సవాలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖలతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

హైదరాబాద్ నగరం అన్నిమతాలను గౌరవించే ఒక సామరస్యాని(Samarasyani)కి చిహ్నంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిమజ్జనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలను పూర్తిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply