యాద‌గిరిలో ప్ర‌త్యేక పూజ‌లు

యాద‌గిరిలో ప్ర‌త్యేక పూజ‌లు

యాదగిరిగుట్ట, ఆంధ్ర‌ప్ర‌భ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (న‌ర‌స‌న్న‌) సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) పాల్గొని తరించారు. ఈ రోజు యాద‌గిరి గుట్ట‌కు ఆయనతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్(Justice K. Laxman), జస్టిస్ కె. శరత్, జస్టిస్ కె. సుజన, జస్టిస్ వి.రామకృష్ణా రెడ్డి త‌దిత‌రులు చేరుకున్నారు. కొండపైకి చేరుకున్న వారికి కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఇన్‌చార్జి ఈవో రవి నాయక్(Evo Ravi Naik) ఆధ్వ‌ర్యంలో ఆల‌య అర్చ‌క బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అక్క‌డ నుంచి ప్రధానాలయానికి చేరుకున్న ఆయన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి (Laxminarasimhaswamy)వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో వారికి ఆలయ ఈవో రవి నాయక్ స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు(Rachakonda CP Sudhir Babu), ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply