హైదరాబాద్, ఆంధ్రప్రభ : టెక్ ప్రియులకు శుభవార్త !! ప్రముఖ ఈ-కామర్స్(E-commerce) ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్‌ను ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ లో భాగంగా ఆపిల్, శామ్‌సంగ్, మోటరోలాతో సహా అనేక బ్రాండ్‌లపై డిస్కౌంట్లను పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(festival sale) 2025 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు, ఎర్లీ యాక్సెస్ వంటి మరిన్ని ఆఫర్లు లభించనున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) మెంబర్‌లు సెప్టెంబర్ 22 నుంచే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే, ఈ సేల్ ఎంతకాలం ఉంటుంది అనే సమాచారం లేదు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్‌లో భాగంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు, EMI ట్రాన్సాక్షన్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ సహా గృహోపకరణాల(Home Appliances)పై డిస్కౌంట్‌లు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ లోనూ!!
మరో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్(Big Billion Days) సేల్ తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుండి ఈ సేల్ ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు 24 గంటల ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, గృహోపకరణాలపై డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ సేల్‌లో లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, ఫెస్టివల్ రష్ హవర్స్, డబుల్ డిస్కౌంట్స్(Double Discounts) ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ICICI బ్యాంకు, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్(Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రైబర్లు సేల్‌లో ముందుగానే పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.