14న పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య శిబిరం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 98 రోజుల కార్యాచరణ ప్రణాలికలో భాగంగా ఈ నెల 14 న మున్సిపల్ కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సీ) లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డా హేమంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, దంత వైద్యుడు, కంటి వైద్యుడు (ఆప్తల్మాలజిస్ట్), శిశు వైద్యుడు (పిడియాట్రిషన్), ఆర్థోపెడిక్ నిపుణులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని, ఆధార్ కార్డు జిరాక్స్ ,ఫోన్ నంబర్ తో వచ్చి ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వైద్య సేవలను పొందాలని కోరారు.

Leave a Reply