ఇంద్రకీలాద్రి మహోత్సవానికి మంత్రులకు ప్రత్యేక ఆహ్వానం..

ఇంద్రకీలాద్రి మహోత్సవానికి మంత్రులకు ప్రత్యేక ఆహ్వానం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఈనెల 6వ తేదీ నుండి 8వ తేదీ నిర్వహించనున్న కుంభాభిషేక మహోత్సవాలకు మంత్రులు లోకేష్ , ఆనం రామ నారాయణ రెడ్డికి ఆహ్వాన పత్రికను దేవదాయ, దేవస్థానం యంత్రాంగం అందజేశారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ మంత్రివారిని కలిసి ఆహ్వానం అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్, వేద పండితులు, అర్చకులు మంత్రివారికి వేద ఆశీస్సులు అందజేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం సమర్పించారు.

Leave a Reply