సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తా..

జైనూర్, ఆంధ్రప్రభ ; పంచాయతీలోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని కొమరం భీం ఆశిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానాపటార్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ అన్నారు. పంచాయతీలోని మర్కగూడ (జి) లో నీటి ఎద్దడి సమస్య ఉందని చాలా రోజుల నుంచి చెడిపోయిన బోరింగ్ మరమ్మతులు చేయించడం లేదని ఆ గ్రామ ఆదివాసీలు సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించి స్వయంగా చెడిపోయిన బోరింగ్ వద్ద నిలబడి మరమ్మత్తు పనులు చేయించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పంచాయతీలో ఏ సమస్యలున్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పంచాయతీ అభివృద్ధికి పాటుపడతానని ఆమె ప్రజలతో అన్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ కోరారు. మర్క గూడ (జీ)లో నీటి సమస్య పరిష్కరించినందుకు సర్పంచుకు కార్మికులు జగన్ , దేవరావులకు గ్రామస్తులు విజయకుమార్ కృష్ణ హనుమంతు అనిల్ కుమార్ లేతు జంగు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply