special attention | మార్పుకోసం అవకాశం ఇవ్వండి…
special attention | జైపూర్, ఆంధ్రప్రభ : ఇందారం గ్రామ ప్రజలు ఒక్కసారి గ్రామ మార్పు కోసం తనను సర్పంచ్ గా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కొరివి శేఖర్ కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను(problems) పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ(special attention) కనబరుస్తూ గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

