special attention | ప్రచారం అదిరింది

  • తరలివచ్చిన వేలాది మహిళలు
  • మారుమోగిన బాలు గుర్తు నినాదాలు
  • దశరథం విజయం ఖాయమైంది

special attention | కమలాపూర్, ఆంధ్రప్రభ : కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బైరీ దశరథం(Byri Dasharatha) ఈ రోజు ప్రారంభించిన ఎన్నికల ప్రచారం అదిరింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వైర్ దశరథం ప్రచార పర్వం మొదటి రోజే ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించింది. వేలాదిమంది అభిమానులు, మహిళలు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని చేసిన నినాదాలు మార్మోగాయి.

బాల్ గుర్తుకు ఓటు వేసి బైరిదశరథంను భారీ మెజార్టీతో గెలిపించాలని చేసిన నినాదాలు ఆకాశానికి వినిపించాయి. పద్మశాలి సామాజిక వర్గానికి(social class) చెందిన బైరి దశరథం యువకుడిగా విద్యావంతుడిగా గ్రామంలోని సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వేలాదిమంది అభిమానులు మహిళలతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించి విజయ బాటలో ముందుకుపోతున్నారు.

గతంలో మండల వైస్ ఎంపీపీ గా పనిచేసిన అనుభవంతో పాటు, గ్రామంలోని మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ(special attention) కనబరిచి ప్రజలకు కావలసిన సౌకర్యాలను, అభివృద్ధి పనులను పూర్తి చేసి కమలాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానంటూ హామీలు ఇస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. కమలాపూర్ గ్రామంలో అత్యధికంగా పద్మశాలి ఓటర్లు ఉన్నందున దశరథం గెలుపు ఖాయమనే సంకేతాలు మొదటి రోజు నుండే ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపించాయి.

Leave a Reply