ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ

  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి/రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి నేతృత్వం వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య చిన్న జీయర్ స్వామి గర్భగుడిలోకి ప్రవేశించి సుమారు 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దేవాలయ గోపురంపై కలశపూజ నిర్వహించడంతో కార్యక్రమం శిఖరానికి చేరింది. ఆలయ పునఃప్రతిష్ఠతో గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన చిన్న జీయర్ స్వామి పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆశీర్వాదాలు పొందేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ముందుగా వారికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ ఘనస్వాగతం పలికారు. ఈవో మహేష్ , అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక విశిష్టను వివరించారు.

Leave a Reply