SP Vikrant Patil | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

SP Vikrant Patil | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలను మోసగించేందుకు వివిధ రకాల తప్పుడు లింకులు, నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని , సైబర్ నేరగాళ్లు చేసే మోసాల బారిన పడవద్దని ప్రజలు అప్రమతంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం విజ్ఞప్తి చేశారు. గణతంత్ర దినోత్సవ బహుమతులు, అమర వీరులైన జవాన్లకు విరాళాలు, డొనేషన్స్ , ఫ్లాగ్ పంపిణీకి డబ్బులు వంటి నకిలీ వెబ్ లింకులు పంపి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు సేకరించి మోసాలకు పాల్పడుతుంటారని ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు.

తెలియని లింకులపై క్లిక్ చేయరాదు..

సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మరాదు. అధికారిక వెబ్‌సైట్‌లు మరియు ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలి. మీ వ్యక్తిగత సమాచారం పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటిపిలు అపరిచిత లింక్ లలో పంచుకోవద్దన్నారు. ఎలాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా క్లిక్ చేయకుండా ఉండండి. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయండ‌న్నారు. ఫిర్యాదులకు నేషనల్ సైబర్ హెల్ప్ లైన్: 1930, వెబ్‌సైట్: www.cybercrime.gov.in లో ఫిర్యాదును నమోదు చేయాలని కర్నూలు ఎస్పీ తెలిపారు. మీ సమాచారం గోప్యంగా ఉంటుందని బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply