53 అర్జీలు స్వీకరించిన ఎస్పీ..

53 అర్జీలు స్వీకరించిన ఎస్పీ..

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం
జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి


శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి (K.V. Maheshwara Reddy) సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు (complaints), అభ్యర్థనలు, అర్జీల రూపంలో జిల్లా ఎస్పీకి నేరుగా అందజేశారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులకు ఆయా ఫిర్యాదుల పరిష్కారంపై ఫోన్ ద్వారా తెలిపి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమని, ప్రతి పోలీస్ అధికారి ప్రజా ఫిర్యాదులపై బాధ్యతగా వ్యవహరించి, పరిష్కార చర్యలు చేపట్టి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. కుటుంబ, ఆస్తి, వ్యక్తిగత, మోసపూరిత వంటి వివిధ అంశాలపై 53 ఫిర్యాదులు స్వీకరించారు.

Leave a Reply