SP | భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

SP | గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇవాళ‌ ధరూర్, గోనుపాడు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా, ధరూర్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు పరిశీలించారు. ధరూర్ మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ రోజున సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.

ధరూర్ మండలంలో మొత్తం 14 పోలింగ్ కేంద్రాలు, సుమారు 6,000 మంది ఓటర్లు ఉండగా, ఈ గ్రామం ఎన్నికల దృష్ట్యా క్రిటికల్ గ్రామంగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో ఎస్పీ స్థానిక పోలీసు అధికారులకు శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. తరువాత, జిల్లా ఎస్పీ గోనుపాడు గ్రామాన్ని కూడా సందర్శించారు. ఇక్కడ మొత్తం 1,400 మంది ఓటర్లు ఉండగా, 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎస్పీ ప్రతి కేంద్రంలోని ఏర్పాట్లు, సిబ్బంది సిద్ధత, భద్రతా చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు.

Leave a Reply