South Africa | 27 ఏళ్ల నిరీక్షణకు తెర – సఫారీల చేతుల్లోకి ఐసీసీ ట్రోఫీ!

  • “చోకర్స్” ముద్రను చెరిపేసిన బవుమా సేన – లార్డ్స్‌లో చరిత్ర!
  • బ‌వుమా అన్‌బీటెన్ రికార్డు

1998లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న దక్షిణాఫ్రికా… 27 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. చాలాసార్లు ఆఖ‌రివ‌ర‌కు చేరుకున్నప్పటికీ, అందిన‌ అవకాశాలను వృధా చేసుకుని ‘చోకర్స్’గా ముద్ర వేశారు. అయితే, కెప్టెన్ టెంబా
బావుమా జట్టు ఈసారి మార్పు తీసుకువచ్చింది.

1998లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న దక్షిణాఫ్రికా… 27 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. అనేకసార్లు టోర్నీల ఫైనల్స్‌కు చేరిన సౌతాఫ్రికా.. అనూహ్యంగా ఓడిపోయి ‘చోకర్స్’ అనే ముద్రను మూటగట్టుకుంది.

అయితే, ఈసారి టెస్టు కెప్టెన్ టెంబా బవుమా నాయకత్వంలో ఆ ఫలితం తారుమారు అయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించి, దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది.

టెస్టు కెప్టెన్‌గా బవుమా రికార్డ్:

మ్యాచులు: 10
విజయాలు: 9
పరాజయాలు: 0
డ్రా: 1

టెస్టు క్రికెట్‌లో టెంబా బవుమా ఒక అసాధారణమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు బ‌వుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా 10 టెస్టులు ఆడి, 9 మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒక్క పరాజయం కూడా లేకుండానే 100% అన్‌బీటెన్ రికార్డుతో బవుమా తన కెప్టెన్సీ ప్రతిభను చాటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *