Soundarya Lahari | సౌందర్య లహరి – 94

94. కళంకః కస్తూరీ రజనికరబింబం జలమయం
కళాభిఃకర్పూరైర్మరకతకరండంనిబిడితమ్
అతస్త్వద్భోగేనప్రతిదినమిదంరిక్తకుహరం
విధిర్భూయోభూయోనిబిడయతిసూనం తవ కృతే.     

తాత్పర్యం: అమ్మా! ఆకాశంలో కనపడే చంద్రబింబం నీవు సింగారించుకునే సామాగ్రిని పెట్టుకునే మరకతమణులతో చేయబడిన భరిణయే! ఆ నల్లని మచ్చ నువ్వు తిలకంగా ధరించే కస్తూరియే. చంద్రుడిలో ఉన్న జలతత్త్వం నువ్వు జలకమాడటానికి ఉపయోగించే పన్నీరు. చంద్రకళలు అని అందరూ భావించేవిపచ్చకర్పూరపు ఖండాలు. ఈ వస్తువులని నీవు నిత్యం అలంకారం కోసం వాడటం వల్ల తరిగి పోతుంటాయి. నీ ఆజ్ఞ మేరకి సృష్టికార్యం నిర్వర్తించే బ్రాహ్మ మళ్ళీ మళ్ళీ  ఆ కాళీలని నింపుతూ ఉంటాడు. 

  • డాక్టర్ అనంత లక్ష్మీ

Leave a Reply