9. మహీంమూలాధారే,కమపి మణిపూరే,హుతవహం
స్థితంస్వాధిష్ఠానే, హృది మరుత,మాకాశ ముపరి,
మనో2పి భ్రూమధ్యే,సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసిపత్యా విహరసే.
తాత్పర్యం: జగజ్జననీ! కుండలినీ మార్గంలో ఉన్న మూలాధారచక్రమునందు పృధ్వీతత్త్వాన్ని, మణిపూరక చక్రమునందు జలతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రమునందు అగ్నితత్త్వాన్ని, హృదయస్థానంలో ఉండే అనాహతచక్రమునందు వాయుతత్త్వాన్ని, దానికి పైన ఉండే విశుద్ధిచక్రమునందు ఆకాశతత్త్వాన్ని, భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రమునందు మనస్తత్త్వాన్నిఛేదించుకుంటు పోయి, చిట్టచివరకు సహస్రారకమల మందు ఒంటరిగా నున్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యముగా విహరిస్తున్నావు.
- డాక్టర్ అనంతలక్ష్మి