సౌందర్య లహరి

86. మృషాకృత్వాగోత్రస్ఖలనమథవైలక్ష్యనమితం
లలాటేభర్తారంచరణకమలేతాడయతి తే
చిరాదంతశ్శల్యందహనకృత్యమున్మూలితవతా
తులాకోటిక్వాణైఃకిలికిలితమీశానరిపుణా.

తాత్పర్యం: అమ్మా! పొరపాటున నీ దగ్గఱపరస్త్రీ పేరుని ఉచ్చరించి, చేసిన తప్పుని దిద్దుకునే ఉపాయం లేక నీ పాదాలకి ప్రణామం చేసినప్పుడు నీవు శివుడి నుదుటపాదతాడనం చేయగా, శివుడి శత్రువైన మన్మథుడు చిరకాలంగా తనని దహించినందు వల్ల కలిగిన హృదయశల్యం పోయి, కిలకిలా నవ్వినట్టు నీ కాలిగజ్జెలు చిరుసవ్వడులు చేశాయి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply