సౌందర్య లహరి

80.కుచౌసద్యస్స్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ
కషంతౌదోర్మూలేకనకకలశాభౌకలయతా
తవ త్రాతుంభగ్నాదలమితివలగ్నంతనుభువా
త్రిధానద్దం దేవి త్రివళి లవలీ వల్లిభిరివ.

తాత్పర్యం: ఓ దేవీ! అప్పటి కప్పుడే చిరుచెమటలతోచెమరుస్తూ ఉన్న ప్రక్క భాగాలని అంటుకొని ఉన్న ఱవికెపిగిలిపోతుందేమో అనే అనుమానాన్ని కలిగిస్తూ, బాహుమూలాలనిఒరుసుకుంటూ, బంగారుకడవల వంటి సొగసుతో అందంగా కనపడుతున్న పాలిండ్లను నిర్మిస్తున్న మన్మథుడు – ఈ పాలిండ్లబరువుకితునిగిపోయే ప్రమాదం రాకుండా నడుముని కాపాడటానికి ఏలకితీగెలతో కట్టిన కట్లాఅన్నట్టుత్రివళులతో నీ నడుము అందగిస్తూ ఉంది.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply