76. హర క్రోధాజ్వాలావళిభిరవళీఢేనవపుషా
గభీరే తే నాభీసరసికృతసంగోమనసిజః
సముత్తస్థాతస్మాదచల తనయే ధూమలతికా
జన స్తాంజానీతే తవ జనని రోమావళి రితి.
తాత్పర్యం: కొండలరేడుకుతురా! శివుడి క్రోధాగ్నిజ్వాలల చేత క్రమ్మబడిన తన శరీరంతో మన్మథుడు లోతైన నీ బొడ్డు అనే కొలనులోకి దూకి మునిగి నప్పుడు, ఆ నిప్పు చల్లబడి నల్లని పొగ కొలను నుండి పైకి లేచింది. దానిని చూచిన జనులు నీ నూగారుగా భావిస్తున్నారు.
- డాక్టర్ అనంతలక్ష్మి