సౌందర్య లహరి

73. అమూ తే వక్షోజావమృతరసమాణిక్యకుతుపౌ
న సందేహ స్పందోనగపతిపతాకేమనసి నః
పిబంతౌ తౌ యస్మాదవిదితవధూసంగరసికౌ
కుమారా వద్యాపిద్విరవదనక్రౌంచదళనౌ.

తాత్పర్యం: పర్వతరాజైనహిమవంతుడివంశానికికీర్తిపతాక అయిన పార్వతీదేవి! నీ స్తనములు అమృతరసముతో నిండిన పద్మరాగమణులతో చేయబడిన కుప్పెల వలె కనపడుతున్నాయి అనటానికి మా మనస్సులో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఆ స్తన్యాన్ని త్రాగిన గజముఖుడైన వినాయకుడు,క్రౌంచపర్వతాన్ని పగులగొట్టిన కుమారస్వామి ఇప్పటి వరకు ఎటువంటి కాంతాసంగమునందు ఆనందమును ఎరుగని వారై బాలురు గానే ఉన్నారు కదా.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *