సౌందర్య లహరి

60. సరస్వత్యాః సూక్తీ రమృతలహరీకౌశలహరీః
పిబంత్యాశ్శర్వాణీశ్రవణచులుకాభ్యామవిరళమ్
చమత్కార శ్లాఘా చలిత శిరసఃకుండలగణో
ఝణత్కారైస్తారైఃప్రతివచనమాచష్ట ఇవ తే.
తాత్పర్యం: జగజ్జననీ! సరస్వతీదేవి చేసే మధుర గానామృత ప్రవాహపు పొంగుని ఎడతెగని విధంగా చెవులు అనే పుడిసిళ్ల చేత ఆస్వాదించటంలో పొందే ఆనంద ఆశ్చర్యాలని పొగడటానికి తలపంకించగా –మెచ్చుకోలు మాటలని నీ కర్ణాభరణాలన్నీ ఒక్కసారిగా తార స్థాయిలో ఝణత్కార ధ్వనులు చేసి తెలుపుతున్నట్టు అనిపిస్తోంది.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *