13. నరం వర్షీయాం సం నయన విరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత మనుధావంతిశతశః
గలద్వేణీబంధాఃకుచకలశవిస్రస్తసిచయాః
హఠాత్త్రుట్యత్కాంచ్యోవిగళితదుకూలాయువతయః .
తాత్పర్యం: జగన్మాతా! నీ కృపా కటాక్షవీక్షణానికి పాత్రుడైన నరుడు ఎంత వృద్ధుడైనా, వికారమైన రూపం కలవాడైనా, కామకేళీ విలాసాలు తెలియని వాడైనా– వందల కొలది యువతులు అతడిని చూడగానే కొప్పు ముడులు విడివడుతుండగా, గుండెల పైనుండి జారిపడుతున్న పైటకొంగులతో,వదులైనపోకముడులు,మొలనూళ్లతో వెంట పరుగు పెడతారు కదా! కురూపి అయిన ముసలి కూడా అమ్మ అనుగ్రహం ఉంటే మన్మథుడు లాగా అనిపిస్తాడని ఒక అర్థం. వయోభేదం లేక అందరు అతడి దివ్యతేజస్సుకిఆకర్షితులౌతారుఅని అసలు అర్థం.ొ
- డాక్టర్ అనంతలక్ష్మి