100. ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవిధిః
సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా
స్వకీయైరంభోభిస్సలిలనిధిసౌహిత్య కరణం
త్వదీయాభిర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతి రియమ్.
తాత్పర్యం: వాక్ప్రపంచానికి మూలమైన తల్లీ! సూర్యుడికి తనకి చెందిన దివిటీలతోనే నీరాజనం ఇచ్చినట్టు, చంద్రుడికి అతడికే చెందిన చంద్రకాంతశిలల నుండి స్రవించే నీటితో అర్ఘ్యం ఇచ్చినట్టు, సముద్రజలాలతో సముద్రుడికి తర్పణాలు సమర్పించినట్టు ఉంది నీ నుండి ఉత్పన్నమైన వాక్కులతో చేసిన ఈ స్తుతి.
డాక్టర్ అనంత లక్ష్మీ