నాగార్జునకు సారీ..
అక్కినేని నాగార్జునకు (Nagarjuna) తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) క్షమాపణ చెప్పారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యల పై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జునను కానీ.. వాళ్ల కుటుంబాన్ని కానీ (Akkineni Family) కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని.. తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే.. చింతిస్తున్నాను. తన వ్యాఖ్యలను ఉపసంహకరించు కుంటున్నాను అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే.. అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

