sorcery | నివాసాల మధ్య.. ఇంటి ముందే..

sorcery | నివాసాల మధ్య.. ఇంటి ముందే..
నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలో క్షుద్రపూజల కలకలం
sorcery | అచ్చంపేట,ఆంధ్రప్రభ: అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాలనీలో నివసిస్తున్న దేవా అనే వ్యక్తి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో చేతబడి చేశారు. ఉదయం వారు లేచి చుడగా ఇంటి ముందు కోడిపేగులు, పాము బొమ్మ, పసుపు–కుంకుమ కలిపిన బియ్యం, నిమ్మకాయలతో కూడిన పూజా సామగ్రిని చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని అచ్చంపేట పట్టణ ఎస్సై ఇందిరా తెలిపారు.
చంద్రగ్రహణం రానున్న నేపథ్యంలో ముందస్తుగా ఇలాంటి పనులు చేశారా.. అని కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో క్షుద్ర పూజలు చేయడంతో పట్టణవాసులను భయాబ్రాంతులకు గురి చేస్తోంది. పట్టణ ప్రాంతంలో రక్షణ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు కోకొల్లలు జరుగుతాయి. వారికి ఏ విధంగా రక్షణ ఉంటుందని సర్వత్రా ప్రశ్నలు వెలువెతున్నాయి. క్షుద్ర పూజలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

