శంషాబాద్, మార్చి 13(ఆంధ్రప్రభ) : ఆస్తి కోసం తన తల్లిని కొడుకు హత్య చేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాల్లగూడ సమీపంలో రాఘవేంద్ర కాలనీలో ప్రకాష్ అనే యువకుడు మద్యం మత్తులో తన తల్లి చంద్రకళను దారుణ హత్య చేశాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో తల్లిని రాడ్డుతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Crime | ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
