కర్నూలు బ్యూరో : రెండు రోజుల క్రితం వచ్చిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు ఫెయిల్ కావడంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూల్ నగర పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… నగరంలోని లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్.
ఇటీవల వెలువడిన 10పరీక్షల ఫలితాల్లో భరత్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయంలో భరత్ తల్లిదండ్రుల మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఇది గమనించిన భర్త ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.