Social service | మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం

Social service | మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం

  • 70 మంది యువకుల రక్తదానం

Social service | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సామాజిక సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 70 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా మార్వాడి యువ మంచ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం మించిన సేవ లేదని, దేశ సేవే లక్ష్యంగా యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణంలో తమ సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Social service |

ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్ అధ్యక్షుడు కృష్ణకాంత్ సోనీ, సెక్రటరీ బాల ప్రసాద్ మారు, జాయింట్ సెక్రటరీ విజయ్ నాహోటి, చంద్రకాంత్ తోష్నివాల్, ట్రెజరర్ కమల్ లాహోటి, ఉపాధ్యక్షుడు అరవింద్ అగర్వాల్ పాల్గొన్నారు. అలాగే రక్తదాన శిబిరం చైర్మన్ అఖిల్ జవర్, క్యాంపు కన్వీనర్ రాజేందర్ లాహోటి మరియు సంఘ సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply