- ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
- ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, భవానిపురం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసానే ప్రధాన లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ ఆరు పంపుల బావి సెంటర్ లో శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్‌తో కలిసి పాల్గొన్నారు.
లబ్ధిదారులతో స్వయంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడి..పెన్షన్ తో పాటు మహిళలకు,వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు సారథ్యంలో పేదల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు.
కార్యక్రమంలో 55వ డివిజన్ ప్రెసిడెంట్ జాహీద్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర మైనార్టీసెల్ ప్రధానకార్యదర్శి ఫతావుల్లాహ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆషా, తెలుగు మహిళ పశ్చిమ నియోజకవర్గ అద్యక్షురాలు సుఖాసి నరిత, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, బుద్దా ఆలయ చైర్మన్ పిళ్లా సుదర్శన్, సీనియర్ నాయకులు కామా దేవరాజు, డివిజన్ ప్రెసిడెంట్లు అజీజ్, దుర్గరావు, గంగాధర్,బడుగు వెంకన్న, కుంచం దుర్గరావు, రాంబాబు, అమర మురళీ, బుదాల నందకుమారి, నాయకులు అన్సర్, నహీద్, క్లస్టర్ ఇన్చార్జులు సుబ్బారెడ్డి, ధనేకుల సుబ్బారావు, సుభానీ, సుఖాసి కిరణ్ పాల్గొన్నారు.

