NSS Students | సోషల్ మీడియాను మంచి కోసం వాడితే ఇదే ఫలితం

NSS Students | సోషల్ మీడియాను మంచి కోసం వాడితే ఇదే ఫలితం
- సోషల్ మీడియా: వ్యసనమా? ఆయుధమా?
- నిండు ప్రాణాన్ని కాపాడిన ఉరవకొండ విద్యార్థుల చొరవ
- స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి పునర్విక
- చిరు వేతనం నుంచి భారీ సహాయం సేకరణ
- NSS విద్యార్థుల సేవా స్పూర్తి
- సోషల్ మీడియా మంచి కోసం కూడా ఉపయోగపడుతుందన్న సందేశం
- విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం
- టెక్నాలజీ వినియోగంపై ఆలోచింపజేసే సంఘటన
NSS Students | ఉరవకొండ, ఆంధ్ర ప్రభ: సోషల్ మీడియా.. ప్రస్తుతం ఒక సెన్సేషన్. కొందరికి కాలక్షేపం, మరికొందరికి వ్యసనం. ఇంకొందరికి ఇతరుల వ్యక్తిత్వాన్నికి హని చేసే ఆయుధం. రాజకీయ కక్షలు, మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టులతో సామాజిక మాధ్యమాలు కలుషితమవుతున్న వేళ.. అదే మాధ్యమం ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు వారధిగా మారుతుందని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరూపించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల పది నెలల కుమార్తె పునర్విక ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ (కండరాల బలహీనత) అనే వ్యాధితో పోరాడుతోంది. ఈ చిన్నారి పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విద్యార్థులు చలించిపోయి, సహయం చేసేందుకు ముందుకు వచ్చారు.
NSS Students | చిరు వేతనం.. భారీ వితరణ
కళాశాలలోని ప్రతి తరగతికి వెళ్లి, తోటి విద్యార్థులకు సమస్యను తెలియపరిచి 7 వేల రూపాయల నగదును సేకరించారు. ఆ మొత్తాన్ని కళాశాల (College) ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆదినారాయణ చేతుల మీదుగా చిన్నారి తల్లిదండ్రులకు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. దీంతో ఆ విద్యార్థులు చేసిన మంచి పనికి కళాశాల ప్రినిపల్ అభినందించారు.
NSS Students | ఆలోచింపజేసే అంశం:
ప్రస్తుతం విద్యావంతులే సోషల్ మీడియాలో పైశాచికానందానికి పాల్పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. సోషల్ మీడియాలో పేరుగుతున్న వ్యతిరేక భనాలకు చెక్ పెటేందుకు ఆస్ట్రేలియా వంటి దేశాలు 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, సోషల్ మీడియాను మనుషుల సమస్యలను పరిష్కరించే వేదికగా మార్చుకోవచ్చని ఉరవకొండ విద్యార్థులు చాటిచెప్పారు. విద్యార్థుల ఈ చొరవను NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి. వెంకట రాముడు, పరమేష్ కళాశాల సిబ్బంది అభినందించారు. “టెక్నాలజీని వాడే విధానంలోనే మార్పు ఉందనేది” ఈ విద్యార్థులు నిరూపించిన సత్యం ఈ సంఘటన.
CLICK HERE TO READ శ్రీశైలంలో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఆరా…
