Social media ban | 13ఏళ్ల లోపు వారికి…

Social media ban | 13ఏళ్ల లోపు వారికి…

Social media ban | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. 13ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని బ్యాన్ చేయాలని భావిస్తోంది. దీన్ని 90రోజుల్లోనే అమలుచేసే దిశగా చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… సోషల్ మీడియా (Social media) వల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచన అన్నారు.

సీఎం చంద్రబాబు (CM Chandrababu) అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. 90 రోజుల్లో దీనిని అమలు చేసేలా విధివిధానాలు ఖరారు చేస్తామని, 16 ఏళ్ల వరకు కూడా నిషేధం విధించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. అందరూ అంగీకరిస్తే 16 ఏళ్ల వయసువారి వరకు నిషేధం విధిస్తామని, సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply