Social check | 4వ విడత సామాజిక తనిఖీ గ్రామసభలు…

Social check | 4వ విడత సామాజిక తనిఖీ గ్రామసభలు…

Social check | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : రాయపోల్ మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4వ విడత సామాజిక తనిఖీ గ్రామసభలు ఈ రోజు నిర్వహించారు. మండలంలోని రాo సాగర్, అంకిరెడ్డిపల్లి, అనాజీపూర్, రామారo, ఎల్కల్, వడ్డేపల్లి, వీరారెడ్డి పల్లి, టెన్కంపేట, లింగారెడ్డి గ్రామాల్లో ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పనుల అమలు, కూలీల హాజరు, చెల్లింపులు, పనుల నాణ్యత తదితర అంశాలపై సామాజిక తనిఖీ బృందాలు పరిశీలన చేపట్టాయి.

గ్రామస్థులు తమ అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గ్రామసభల్లో డీఆర్‌పీలు, బీఆర్‌పీలు, సంబంధిత అధికారులు పాల్గొని వివరాలు సేకరించారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామస్థులు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు వాసుదేవ్, ఉసిగారి స్వామి, రాజాగారి రేణుక, వెంకటయ్య, శశికాంత్, స్వామి, టెక్నికల్ అసిస్టెంట్ రవి, వివిధ గ్రామాల సెక్రెటరీ, పిల్డ్ అసిస్టెంట్ లు, ఉపాది హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply