చిన్న వయసులోనే సిగరెట్లు కాల్చేస్తున్నారు..

- యువతకు అవగాహన కార్యక్రమాలు లేకపోవటమే ప్రధాన కారణం
వికారాబాద్ టౌన్, (ఆంధ్రప్రభ):నిషేదిత పోగాకు సేవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ 37 సంవత్సరాల క్రితం మే 31 వ తేదిన 1988 లో పొగాకు నిషేదిత దినంగా ప్రకటించింది. ఇటీవల యువత స్కూల్ కళాశాలల నుండి బయటకు వచ్చి గుట్కా సిగరెట్లకు అలవాటు పడుతున్నారు.
చిన్న పిల్లలకు గుట్కా సిగరెట్ల్ అమ్మరాదని నిబంధన ఉన్నా.. అది అమలు కావటం లేదు. విచ్చల విడిగా ఈ అమ్మకాలు జరుగుతున్న కారణంగా…. చిన్న వయసు వారు వీటి బారిన పడుతున్నారు.
యువతకు ఈ విషయంలో అవగాహన కలిపించే వారే కరువు కావటంతో క్షయా మలేరియా లాంటి వ్యాధులు సోకి మృత్యు వాత పడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది.
పోగాకు సేవించటం ద్వారా అన్ని అవయవలాతో పాటు ఊపిరి తిత్లులు పాడవుతాయని సర్వేలు చెబుతున్నాయి.పోగాకు వ్యాపారం అధిక లాభాలు తెస్తుండటంతో నిషేదిత పొగాకును అరికట్ట లేక పోతున్నారు.
