భూపాల‌ప‌ల్లి జిల్లా ప్రతినిధి : విద్యార్థుల ఆరోగ్యం (Health of students) ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన ఆరుగురు ఉద్యోగుల‌ను డిస్మిస్ (six employees dismissed) చేస్తూ జ‌యశంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ (Jayashankar Bhupalappalli District Collector) శ‌నివారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ అర్బన్ రెసిడెన్స్ పాఠశాల ( Subhash Chandra Bose at Urban Residence School)లో తాగునీటిలో పాయిజన్ (poison in drinking water)కలపడంతో 11 మంది విద్యార్థులు (students) అస్వస్థత గురైన సంగ‌తి విదిత‌మే. ఇందుకు సంబంధించి ముగ్గురు ఉపాధ్యాయుల‌ను, అసిస్టెంట్ కుక్‌ను స‌స్పెండ్ చేసిన సంగ‌తి విదిత‌మే. ఆ స‌స్పెండ్ అయిన వారిని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఉద్యోగాల నుంచి తొల‌గించారు. విద్యార్థుల‌కు ఇచ్చిన తాగునీటిలో విష‌తుల్యం చేసిన సీఆర్‌టీలు సూర్య కిరణ్, వేణు, రాజేందర్, అసిస్టెంట్ కుక్ రాజేశ్వరిని టెర్మినేట్ చేశారు. క‌లెక్ట‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

మొగుళ్ల‌ప‌ల్లి కేజీబీవీ ఎస్ఓ, పీఈటీ తొల‌గింపు
జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి (Mogullapally) మండలం కొరికిశాల కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)లో ఇటీవల రెండు సార్లు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఆస్ప‌త్రిపాల‌య్యారు. అందుకు బాధ్యులుగా చేస్తూ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ బి.శైలజ, పీఈటీయూ శ్రావణిని శాశ్వతంగా విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply