Bhupalpalli | హత్య కేసులో ఆరుగురి నిందితుల అరెస్టు

భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు


ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట వద్ద ఈనెల 10 న జరిగిన భూపాలపల్లి (Bhupalpalli) మండలం కొంపల్లి (Kompally) గ్రామానికి చెందిన పర్ష రవి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు (Sampath Rao) తెలిపారు.

బుధవారం రేగొండ (Regonda) పిఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా రెండో భార్య రేణుకకు అక్రమ సంబంధం ఉన్నదని అనుమానంతో శారీరకంగా, మానసికంగా రవి హింసిస్తున్నాడని పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కుమారుడు శ్రీకర్, తన తల్లి రేణుక, కేటీపీపీ సెక్యూరిటీ గార్డ్ శ్రీ పాల్ తో కలిసి రవిని హత్య చేయాలని పథకం పన్నారని, మరో ముగ్గురుతో కలిసి రవిని హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.20వేల నగదు, ఒక కారు, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Leave a Reply