Sirpur | ఆధ్యాత్మిక సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్, సర్పంచ్

Sirpur | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : శ్రీశ్రీశ్రీ సద్గురు పరమహంస పులాజి బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గాలు ప్రవచనాలు ఎంతో ఆదర్శనీయమని ఆయన చూపిన ధ్యాన ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో కుటుంబాలు బాగుపడి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయని జైనూ ర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు, పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా అన్నారు. గురువారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి పంచాయతీ కేంద్రంలోని శ్రీ శ్రీశ్రీ సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్రంలో గురువారం రెండు రోజులు పాటు నిర్వహించే ఆధ్యాత్మికతత్సం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ విశ్వనాథరావు సర్పంచ్ పాల్గొని ధ్యానకేంద్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధ్యాన కేంద్ర కమిటీ నిర్వాహకులు ఆధ్యాత్మిక సత్సంగ్ జెండా ఆవిష్కరించారు. ఈనెల 12 13 తేదీల్లో రెండు రోజులపాటు తస్సంగాధ్యాత్మిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుగుతాయని, సద్గురు పులాజి బాబా భక్తులు ప్రజలు వేడుకలు హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ సర్పంచ్ నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం మీరాబాయి జాలింశా, పూలాజీ బాబా సంస్థ చైర్మన్ రఘునాథ్, సభ్యులు విషంరావ్, శ్యాంరావు, గోవిందరావు,గ్రామ పటేల్ జగనాథ్ రావ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
